Thu Dec 19 2024 18:26:27 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ లో పబ్ లపై దాడులు.. డ్రగ్స్ కలకలం
హైదరాబాద్ లో పబ్ లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఇరవై ఐదు పబ్ లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
హైదరాబాద్ లో పబ్ లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఇరవై ఐదు పబ్ లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులు ఉన్నారని అధికారులు తెలిపారు. టీజీ నాబ్ - ఎక్సైజ్ అధికారులు ఈ దాడులను నిర్వహించారు. వీకెండ్ లో హైదరాబాద్ లో పబ్ లపై అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు...
డ్రగ్స్ తీసుకున్న ఐదుగురు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా గుర్తించారు. ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించగా, ఒకరు మాత్రం గంజాయి సేవించినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకు వచ్చారన్న దానిపై విచారణ జరుపుతున్నారు.
Next Story